ఈ పుస్తకం చదవబోయే ముందు ఈ పుస్తక రచయిత గురించి కొంత తెలుసుకోవాలి. ఈ పుస్తక రచయిత స్వామి సుఖబోధానంద. కాషాయ వస్త్రాలు ధరించే ఈ రచయిత చాలా చిన్నతనంలోనే సన్యాసం తీసుకున్నారు. పెళ్ళికాలేదు. పిల్లా పాపా లేని వారు. అలాంటపుడు సంసారం గురించీ, పిల్లల పెంపకం గురించి అనుభవం పిసరంతైనా లేనప్పుడు వాటి గురించి మనకేం సలహాలు చెప్పగలరు? నిజమే! ఈ సందేహం సరైనదే. కాని దానికి ఆయనేమంటారంటే ''కామ సూత్రం రచించిన వాత్సాయనుడు కూడా బ్రహ్మచారే అన్న విషయం మీకు తెలుసా? ఈ ప్రపంచంలో జీవించి - మరణించిన తరువాత మీ జీవితాలేమౌతాయి అన్ని చెప్పడం మాత్రమే ఒక సన్యాసి బాధ్యత కాదు. మనిషి జీవితానికి ఉపయోగపడే మంచి చెడ్డలు తెలియ చెప్పి శాంతి సంతోషాలతో, సంతృప్తిగా ఎలా జీవించాలో చెప్పడం కూడా నాకర్తవ్య మనుకుంటున్నాను'' అని.

స్వామీజీ ఎందర్నో గమనిస్తుంటారు. వారి మధ్య ఏర్పడే సంబంధ బాంధవ్యాల రాపిడిలో ఏర్పడే కొన్ని సమస్యలను అర్ధం చేసుకుని, సంసారమనే రైలు బండి ఎంతవరకూ పట్టాలపైన నడిచిందీ, ఎక్కడ పట్టాలు తప్పిందీ అన్న విషయం అంచనా వేయగల సమర్ధులు.  శాంతి సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందించటానికి బయలుదేరిన ఒక అవధూతగా, క్లిష్టమైన వేదాంత సత్యాలను సులువుగా బోధించగల అసామాన్య ప్రజ్ఞావంతుడుగా మనకు ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ఆనందించగల కళను నేర్పుతున్న స్వామి సుఖబోధానంద ఈ పుస్తకంలో అందించిన విషయాలను ఆకళింపు చేసుకొని ఆచరణలో పెట్టి తమ కుటుంబాలతో పాఠకులు రిల్యాక్స్‌ కావచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good