సమాజంలో వ్యక్తులందరూ అద్భుతాలు సృష్టించరు. అందరూ వీరోచిత కార్యక్రమాలు నిర్వహించరు. ఐతే చరిత్ర మలుపు తిరిగిన ప్రతిసారి చరిత్ర చోదకశక్తులుగా ప్రజలే ముందు వరసన నిలుస్తారు. చరిత్ర గతిని మారుస్తారు. ఐతే దైవందిన జీవితంలో అదే ప్రజలు సాధారణంగా జీవిస్తారు. రాజీపడుతూ బతుకు బండిని లాగుతుంటారు. అలాంటి సగటు మానవుల ప్రతినిధి చిన్నారావు.
జీవితం చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. చిన్నారావు జీవితాన్ని, అతని చైతన్యాన్ని, సంక్షోభాలను, సంఘర్షణలను ప్రభావితం చేసిన విధానాన్ని పార్థసారథిగారు ప్రతిభావంతంగా చిత్రీకరించారు. నవల ఆదర్శాలతో ముగియదు. గొప్ప పరిష్కారాన్ని చూపదు. కాని ఒక నిండు జీవితాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలోని ద్వంద్వ విలువలను ప్రదర్శిస్తుంది. ఆలోచింపజేస్తుంది. వాస్తవికతకు పట్టం కడుతుంది. చక్కగా చదివించగల ధారాళమైన శైలిలో నవల రూపొందిన ముక్తవరం వారికి అభినందనలు.
- సురవరం సుధాకరరెడ్డి
Rs.60.00
In Stock
-
+