1940 తర్వాత ఒక దశాబ్దముపాటు ఆంధ్రసాహిత్యలోకము నుత్తేజిత మొనర్చిన అభ్యుదయ కవిత్వోద్యమ మూలవిరాట్టు శ్రీశ్రీ. భావికవిత్వమునకు విరుద్ధముగా జెండా యెత్తులతోనే కాక, శ్రామికవర్గచైతన్య మూపిరిగాగల ఒక సరిక్రొత్త కవితారీతికి పాదులువేసిన స్రస్ఠ శ్రీశ్రీ. భావకవుల చేతులలో వైదర్భీరీతులను వెలార్చుకొన్న గేయమును గౌడీరీతిలో నడిపిన ఛందోరహస్యవేత్త శ్రీశ్రీ. వాస్తవికతతో పాటు అధివాస్తవికతను, వ్యక్తిచైతన్యముతోపాటు సంఘ చైతన్యమును సమానాధికారముతో ప్రవచించిన ప్రవక్త శ్రీశ్రీ. ఐనను విరాట్‌ స్వరూపము నందుకొనుటకు ముందు శ్రీశ్రీ వామనమూర్తిపొందిన వివిధ దశలను పరిశీలించుట అత్యావశ్యము. ప్రథమదశలోని శ్రీశ్రీ రచనాస్వరూపమును పరిశీలించినగాని, అతని పరిణతిదశలోని రచనల మహత్త్వము బోధపడదు. అందుకొరకు శ్రీశ్రీ రచనాజీవితమును ప్రథమదశ, పరివర్తన దశ, పరిణతిదశయను మూడు భాగములుగా వింగడించితిని. ఈ త్రిదశలలో శ్రీశ్రీ పొందిన 'ప్రతివిక్రమత్వ'మును క్రమముగా నివేదింతును.

పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good