వైద్య వృతి ఏంతో ఉన్నతమైనది రచనా వ్యాసంగం ఒక అద్భుతమైన ప్రక్రియ. వైద్య వృతి లో ఉంటూ ఇటువంటి ప్రక్రియ తెలిసి రచనలు చేయగలిగిన వారు చాలా అరుదుగా వుంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల కోవకు చందినవారే ప్రముఖ ఇ .ఎన్.టి. వైద్య నిపుణులు డా|| జగన్మోహన రావు.
అకాడమిక్ గా కాకుండా సామాన్యప్రజలను దృష్టిలో పెట్టుకుని వ్యాధుల సమస్యలను వివరించటం బాగుంది. డా|| జగన్మోహన రావు. చెవి, ముక్కు గోతుకు సంబంధించిన వైద్య నిపుణులైనప్పటికి ఈ పుస్తకంలో రాధానంగా నోరు, గొంతు లాలాజల గ్రంధులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు.
నోటిపూత , నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సాధారణ సమస్యలు నోటి క్యాన్సర్ వ్యాధి రావటానికి ప్రధానమైన కారణాలను చక్కగా తెలియచెప్పారు. ప్రధానంగా పొగ త్రాగటం ,గుట్కా పాన్ మసాలాలు నమలటం వాళ్ళ వచ్చే అనర్ధాలను వివరించిన తీరు బాగుంది.
గొంతుకు సంబంధించిన సాధారణ ఇన్ఫెక్షన్ మొదలుకొని డిప్తీరియా , టాన్సిల్స్ వంటి ఇబ్బందికరమైన వ్యాధులను గురించి వివరించారు. టాన్సిల్స్ పై సవివరంగా అందించిన సమాచారం సామాన్యలకు ఏంతో మేలు చేస్తుంది. గురక వంటి అనేక సమస్యలకు మూకకారణం ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది.
మనిషి ఆరోగ్యంగా ఉండటంలో లాలా జల గ్రంధులు కీలక పాత్ర వహిస్తాయి. పుస్తకాన్ని వ్రాయటం ఒక ఎత్తు అయితే ఈ పుస్తకాన్ని అందరికీ అర్ధమయ్యేలా వ్రాయటం మరో ఎత్తు . డా|| జగన్మోహన్ రావు ఎంచుకున్న రచన శైలి బాగుంది ఈ పుస్తకంలో వ్యాధులు, వాటివల్ల వచ్చే పద్దతులను కూడా వివరిందమే కాకుండా చికిత్సా విధానం, నివారణ పద్దతులను కూడా వివరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good