ఇందులో ఐదు చైనా, నాలుగు ఆంగ్ల, ఒకటి రష్యా, మరొకటి పంజాబీ భాషల కథలున్నాయి. సామాజిక, మానవీయ, విషాద, సరదా, సందేశాత్మక, పత్తేదారు యితివృత్తాలతో కూడిన కథలివి. రచయితలందరూ ప్రసిద్ధులే.

దయ, జాలి, కరుణలతోపాటు దాతృత్వాన్ని మహోన్నతంగా ప్రబోధించిన, ప్రతిపాదించిన కథ, విలువలకీ, స్వచ్ఛతకీ ప్రతీకలుగా ఆనందరాజు, శ్వాలోలను చిత్రించి ఆ పాత్రలతో సహా ఈ కథ ద్వారా రచయిత ఆస్కార్‌వైల్డ్‌ చిరంజీవులైనారు. ప్రపంచ కథా చరిత్రలో నిలిచిన చిరస్మరణీయ కథ 'ఆనందరాజు'. ఈ కథ నా గుండెను తడి చేసింది. ఈ సంకలనానికి శీర్షికగా వుంచిన 'నివురు గప్పిన నిజం' కథలోని ఆక్సెనోవ్‌ జీవన విషాదం పాఠకుడి హృదయాన్ని గాయం చేస్తుంది... పెనుగొండ లక్ష్మీనారాయణ

పేజీలు : 142

Write a review

Note: HTML is not translated!
Bad           Good