కనులకింపైన ప్రకృతీ రమణీయతతో, నిండైన మనుష్యులతో అలరారే గ్రామసీమ 'ఆనందపురం'. ఆ ఊరి దేవాలయంలో భగవంతుని సేవి - 'వేదిత'. విధి వక్రించి జీవితం ఓ శాపంగా మారేసరికి 'వేదిత' అయింది ఆమె. ముగ్ధమోహన సుందరాంగి అయిన అమాయిక. కాని చక్రభ్రమణం నిరంతరం కదా! అందుకని అనుభవాల అంచులుచుట్టి, ఆనందపురానికి వచ్చి తపస్విగా మారి 'నివేదిత' అయింది. నవ్యతలేని ఇతివృత్తాలతో విసిగి, విధిలేక వాటిలోనే ఆణిముత్యాల నేరుకుంటున్న పాఠకులకు నూతన పోకడలతో, విశిష్ట విభిన్న పాత్రలతో, సంపూర్ణ, సమగ్ర మనస్తత్వ నిశిత పరిశీలనతో,త మదుర ఘట్టాలతో, గంభీర సన్నివేశాలతో ప్రతిఒక్కరిని తనదైన బాణీతో ఆకట్టుకున్న శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావుగారి కలం నుంచి వెలువడిన మరో చక్కటి నవల ''నివేదిత''. |