బాత్‌రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదరాగా చేసే చర్య కాదనీ, దీనికొక విధి విధానం ఉందనీ, ఇంకా లోలోతులకు వెళ్తే అందానికి, ఆరోగ్యానికీ, ఆహ్లాదానికీ స్నానం ఒక అత్యుత్తమ సాధనమనీ తెలిస్తే ఆశ్చర్యమనిపించక పోదు. అసలు ఇన్ని రకాల స్నానాలున్నాయనేదే చాలా మందికి తెలీదు.

ఏ స్నానం ఎందుకు ఉత్తమమైనదో, ఏయే సందర్భాలలో చేసే స్నానం వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఈ పుస్తకం వివరిస్తుంది. అంతేకాదు- స్నానానికి గల శాస్త్ర సంబంధాన్నీ విశదీకరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good