ధర్మమనగా గుణం, స్వభావం లేక నియతి అని అర్థం. ప్రపంచమంతా కొన్ని నియమాల ప్రకారం, ధర్మప్రకారం నడుస్తోంది. అభిధర్మమంటే ఈ నియమాల్ని లోలోతుల్లో పరిశీలించి, తర్కవితర్కాలతో (చింతనామయ ప్రజ్ఞ) విశ్లేషించి, అనుభవ (భావనామయ ప్రజ్ఞ) పూర్వకంగా అవగాహనకు తెచ్చుకోవడం.
గౌతమబుద్ధుని బోధనలు మానవాళి సంపూర్ణ వికాసానికి ఎనలేని ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుని బోధనలలో అతి ముఖ్యమైనది అభిధమ్మపిటకం. అభిధమ్మం అంటే విశిష్టమైన ధర్మోపదేశం. ఇది వాస్తవంగా సంక్లిష్టమైన మనోవిజ్ఞాన శాస్త్రమే కాకుండా నీతిని బోధించే ధర్మశాస్త్రం.
మయన్మార్ దేశపు మానవీయ బౌద్ధభిక్షువు అశిన్ జనకాభివంస "Abhidhamma in Daily Life" అనే పుస్తకాన్ని రచించారు. ఇది బుద్ధభగవానుని బోధనలను, ముఖ్యంగా అభిధర్మ జ్ఞానాన్ని సామాన్యులకు పరిచయం చేసే పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. తెలుగు పాఠకులకు అభిధర్మ జ్ఞానాన్ని పరిచయం చేయాలన్న పవిత్రమైన ఆశయంతో "నిత్య జీవితంలో అభిధర్మం" అనువదించటం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good