మూఢాచారాలను ఎంతగా వ్యతిరేకించాడో విద్యకు జ్ఞాన సమపార్జనకు అంతగా ప్రాధాన్యత నిచ్చారు. అదే సమయంలో సమాజానికి పనికి రాని చదువు వ్యర్థమని నిర్ద్వందంగా ప్రకటించాడు. నేడు మనం ఇదే చూస్తున్నాం. కాలేజీలు పెరుగుతున్నాయి. చదువుకు విపరీతంగా ధనం ఖర్చుచేస్తున్నారు. కాని ఆ చదువు సమాజానికి ఉపయోగపడుతున్నదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పొట్టచేతపట్టుకుని విదేశాలలో ఊడిగం చేయాల్సివస్తున్నది. మన సమాజం వారి విద్యను ఎందుకు వినియోగించుకోలేక పోతున్నది? లేదా విద్య సమాజాభివృద్ధికి కావల్సిన జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వడంలేదు! జీవనంకోసం పరదేశాలకు ఎందుకు తరిమేస్తున్నాం? సమాజానికి అవసరమైన నైపుణ్యాలను మన పిల్లలకు నేర్పించకపోతే ఎలా? అందుకే వేమన చదువు కున్నవాని కన్నా చాకలే మేలంటున్నారు.

చదివినయ్య కన్న చాకలియే మేలు

గృహము వేల్పు కన్న గేదెమేలు

బాపనయ్య కన్న బైనీడు మేలయా! ||విశ్వ||


చదువుల్ని చదివి చాలా వివేకియై

కలుష చిత్తుడైన ఖలుని గురియు

దాలిగుంట కుక్క తలచిన చందమె! ||విశ్వ||

Pages : 94

Write a review

Note: HTML is not translated!
Bad           Good