నర్సులకు, కాంపౌండర్లకు, రక్షక భటులకు, ప్రథమ చికిత్స చేసే వారికి నిత్యం ఉపయోగపడే పుస్తకం!
ప్రతి ఇల్లు, విద్యాలయం, ఆసుపత్రి, ఫ్యాక్టరీలో తప్పక వుండాల్సిన పుస్తకం!!
నేడు మన దైనందిన జీవితం యాంత్రికపరమైనది. ఎంతో వేగవంతమైనది. హెచ్చిన జీవనవేగంవల్ల మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే, కొన్నిసార్లు మన తొందరపాటు, అజాగ్రత్తలవల్ల లేదా ఎదుటివారి అజాగ్రత్తవల్ల, ఎన్నో ప్రమాదాలు నిత్యం జరుగుతూనే వున్నాయి, వుంటాయి. జరిగిన ప్రమాదాలకు వెంటనే ప్రథమ చికిత్స జరుగకపోతే జీవితమంతా బాధపడాల్సిన స్థితి, కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించవచ్చు.
అందుకే నిత్యజీవితంలో జరిగే ఎన్నో రకాల ప్రమాదాలకు-పాముకాట్లు, ఎముకలు విరుగుట, చేతులకు, కాళ్ళకు, పొట్టకు, వెన్నెముకకు, తలకు తగిలే గాయాలు, గాయాలు తగలడంవల్ల కలిగే రక్తస్రావం, స్పృహ కోల్పోవడం, విద్యుత్ కారణంగా అయ్యే ప్రమాదాలు, వొళ్ళు కాలడం, బొబ్బలు, మంచుదెబ్బ, వడదెబ్బ, నీటి ప్రమాదాలు మొదలగు వాటికి ప్రథమ చికిత్స వెంటనే ఎంతో అవసరం. ఈ చిరుపుస్తకంలో రష్యన్ రచయిత వి.వి.యుదెనిచ్ ప్రమాదాలకు ప్రథమ చికిత్సల గురించి ఎంతో వివరంగా రాశారు. దాన్నే అత్యంత సులభశైలిలో, సరళమైన తెలుగులో మీకందిస్తున్నాం.ఈ పుస్తకం ప్రథమ చికిత్స చేసేవారికి, చేయదల్చుకున్నవారికి నిస్సందేహంగా ఎంతో ఉపయోగకరం.
Pages : 63