నిత్య జీవితంలో   సైన్సు :
విజ్ఞాన జలధికి చెలియలికట్ట లేదు. కనుచూపుమేర విస్తరించి వున్న విజ్ఞానశాస్త్రాన్ని మామూలు నేత్రంతో చూడలేం. శాస్త్రాన్ని అర్థం చేసుకోవడమంటే విశ్వాన్ని అవగాహన చేసుకున్నట్లే. కనిపించే ప్రతి దృశ్యం ఓ ప్రశ్నను లేవదీస్తుంది. శాస్త్రపరమైన సమాధానం ఆ ప్రశ్నలకివ్వడమంటే ఎంతోకష్టం. కొన్ని చిలిపి ప్రశ్నలని అనిపించినా, వాటికి చీమంత విజ్ఞానదాయకమైన సమాధానాలు కూడా దొరకవు. సరైన సమయంలో చక్కని సమాధానాలు ఆ ప్రశ్నలకి దొరికిననాడు, రేపటి శాస్త్ర పునాదులు గట్టిపడతాయి. చిన్న వయస్సులో చిగురించే ప్రశ్నలకు సరైన శాస్త్ర వివరణ ఇవ్వగలిగితే రేపటి శాస్త్రవేత్తలు కాగల రీనాటి బాలలు. నేటి తరంలో వికసించిన విజ్ఞాన శాస్త్రం అపారం. గణనీయమైన ప్రగతి సాధించినా, శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు, పిల్లలకు చేరువ కావటం లేదు. ఎందరో మహానుభావులు ఈ బాటను సుగమం చేసేందుకు ప్రయత్నించారు. ఈ 'నిత్య జీవితంలో సైన్సు' మరో ప్రయత్నమే. నవ నాగరికతతో పాటు నవీన శాస్త్ర విజ్ఞానం, సదుపాయాలు ఎంతో అవసరం. అతిరథ మహారథుల ప్రయత్నంలో ఏర్పడిన కాసింత కొరతను తీర్చడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good