కిడ్నాపులు, బ్లాక్‌ మెయిలింగ్‌, డ్రగ్‌ ట్రాఫికింగ్‌, పరువు హత్యలు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టినవారిని విదేశాలకు పంపటం - ఇలా ప్రభుత్వానికి సమాంతరంగా నడిచే ఈ మాఫియా పేరు 'ట్రయాడ్‌'...! ఇదొక బలమైన కోటరీ. రాజకీయంగా వారి వెనుక చాణుక్యని మించిన మేధావులు ఉన్నారు. రక్తం తాగే రౌడీలున్నారు. నువ్వొక చిన్న స్కూల్‌ టీచర్‌వి. ఇంత పెద్ద మాఫియాని ఎలా ఎదుర్కొంటావ్‌? నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావ్‌?''

''నన్ను రక్షించుకోవటానికి డాలూ; నేను ఎదుర్కోవటానికి కత్తీ ఉన్నాయండీ.''

''కత్తీ, డాలూనా?''

''అవునండీ. ఎదుర్కోవటానికి 'భారతం', రక్షించుకోవటానికి 'భగవద్గీత'''

---

బోల్డెంత సస్పెన్సూ, కాసింత రొమాన్సూ, అక్కడక్కడ పురాణాలూ, కొండకచో ప్రబంధ వర్ణనలూ... భారతంలోని లౌక్యం, భాగవతంలోని అర్థం కలగలిపి..... నిశ్శబ్ద విస్ఫోటనం.

పేజీలు : 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good