నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా ? - 'జనసాహితి'తో మా విభేదాలు
తీగ లాగారు, డొంకంతా కదిలింది ! (3 విమర్శనా పుస్తకాల సంపుటం) - రంగనాయకమ్మ
ఈ మూడు పుస్తకాలూ చర్చలకూ విమర్శలకూ సంబంధించినవే. వేరు వేరు సందర్భాలకు సంబంధించినవి.
1) నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా ? : చలం సాహిత్యం మీద, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు అనే ఆయన రాసిన 'నిశిత పరిశీలన....' పుస్తకం మీద స్పందనగానే ఈ పుస్తకం రాయవలసి వచ్చింది. చలం సాహిత్యంలో, ఒక్క మంచి అంశం అయినా లేదనీ, ఆ సాహిత్యం పూర్తిగా తిరస్కరించదగ్గదనీ, నిమ్మగడ్డ పరిశీలన తేల్చింది. ఆ నిశిత పరిశీలన, ఎంత నిశితంగా, ఎంత వివేకంగా సాగిందో వివరిస్తూ చేసిన విమర్శ ఇది.
2) 'జనసాహితి'తో మా విభేదాలు : భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్య వాదాల్ని వ్యతిరేకించే లక్ష్యం గల ప్రణాళికతో 1978లో ఏర్పడిన 'జనసాహితి' సంఘంలో రంగనాయకమ్మ గారు ప్రారంభంలోనే చేరడమూ, సంవత్సరన్నర కాలంలోనే బైటికి రావడమూ జరిగాయి. ఆవిడలాగానే మరి కొందరు సభ్యులు కూడా ఆ సంఘం నుండి బైటికి వచ్చారు. అప్పటి నుంచి రంగనాయకమ్మ గారి మీద ఆ సంఘం ద్వారా దుష్ప్రచారం సాగుతుంటే ప్రజాసంఘాలు. ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాయో చూపడానికి ఒక ఉదాహరణగా ఈ పుస్తకం వెలువరించారు.
3) తీగలాగారు, డొంకంతా కదిలింది : ఇద్దరు భార్యాభర్తల విరోధాలలో రంగనాయకమ్మ గారు ఆ భార్య పట్ల సానుభూతితో ఆమెకు సహాయం చేయడం వల్ల, భర్తవైపునుంచి రంగనాయకమ్మగారి మీద ఒక నీచమైన కరపత్రం వచ్చింది. 1987లో ఆ కరపత్రానికి జవాబుగానే రంగనాయకమ్మగారు ఈ పుస్తకం రాయవలసి వచ్చింది. ఆ కరపత్రమే రాకపోతే, అందులో రంగనాయకమ్మ గారి గురించి నీచమైన విషయాలు లేకపోతే, ఈ పుస్తకంతో అవసరం వుండేది కాదు.
ఈ రకంగా వేరు వేరు సందర్భాలలో ఈ పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఒకే సంపుటంగా వస్తున్నాయి. ఇవి, కథలో, నవలలో కావు. నిజ చరిత్రల్లో సంఘటనలు. నిజ వ్యక్తుల ప్రవర్తనలు - దీనికి ముందుమాటలో రచయిత్రి రంగనాయకమ్మగారు - 'జరిగిన సమాచారాన్ని జరిగినట్టుగానే ఇచ్చాను. జరిగినదాన్ని జరిగినట్టు, ప్రతి చోటా ఆధారాలతో ఎక్కడా నా స్వంత కల్పన లేదు' అంటున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good