భారత స్వాతంత్రోద్యమ నేపథ్యంలో రూపుదిద్దుకుకొన్న 'నిష్కామయోగి' అందరూ మరచిపోయిన ఆనాటి రాజకీయ సామాజిక చైతన్యాన్ని మళ్లీ మన కళ్ల ముందు నిలుపుతంది. గాంధీజీ నాయకత్వంలో మారిపోయిన తీరుతెన్నులతో సామాన్యులకు సన్నిహితమయిపోయిన స్వాతంత్య్రోద్యమం జాతీయోద్యమంగా అభివృద్ధి చెంది అందరినీ ఆ ధర్మయజ్ఞంలో భాగస్వాములను గావించి స్వాతంత్య్ర సాధనకు సర్వస్వాన్నీ సమర్పించే త్యాగశీలతను సర్వేసర్వత్రా ప్రతిష్ఠించింది. అపూర్వమైన చైతన్యాన్ని అంతటా రగిలించింది. అటువంటి చైతన్యంలో ఒకానొకమారు మూలరగామం ఎంతగా తలమునకలయి పోయిందో గాంధీజీ  నిర్దేశించిన ఉద్యమాల నన్నింటినీ చిత్తశుద్దితో నిర్వహించటానికి ఎంతగా నడుంబిగించిందో సహజంగా సరళంగా సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేస్తుంది ''నిష్కామయోగి'. అంతటి మహోద్యమ స్వరూప స్వభావాలను ''కొండ అద్దమందు కొంచమై ఉండదా'' అన్నట్లు ఒక గ్రామ పరిధిలో ప్రతిబింబింపజేసే సాహసం చేశారు రచయిత్రి.

పేజీలు : 111

Write a review

Note: HTML is not translated!
Bad           Good