వందల ఏళ్ళనాడే ఆదిమ శంబరుడు తన శత్రువులను నలభైఏళ్ళపాటు నిరంతరాయంగా ప్రతిఘటించాడు, అయినా శంబరుడిని ఓడించగలిగారా? శంబరుడి వారసులు సుదాసు, దివోదాసులు కూడా తమ జీవితకాలంలో ఆ యుద్ధ పిపాసులను కాలూనకుండా ఎదిరిస్తూనే వున్నారు. అప్పటినుండి ఇప్పటి దాకా నాలుగు వేల ఏళ్ళగా మన ఆదిమజాతులను, మూలవాసులను అబద్ధాలతో అర్థ సత్యాలతో దొంగదెబ్బ తీస్తున్నారు తప్ప మనల్ని గెలవలేదు.

నిజంగా ఆ ఆదిమ శంబరుడు ఓడిపోయినట్లయితే ఈ మనువులూ, ఈ కౌటిల్యులూ ఇంతింత గ్రంథాలు ధర్మశాస్త్రాల పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో మనల్ని ఎందుకు కట్టుదిట్టం చెయ్యాలనుకున్నారూ? మనం-శంబరుడి వారసులమైన మనం, ఎప్పటికైనా మన హక్కుల కోసం ప్రశ్నలు వేస్తామేమోననే భయం నిరంతరం వారికి నిద్రపట్టనీయడం లేదు - మనలను ఎప్పటికప్పుడు తల ఎత్తకుండా అణిచివుంచాలనే ఆందోళన, అభద్రత వారిని వెంటాడుతూనే వుంది.

మనకు భూమి కావాల్సిందే, భూమి వుండటం మాత్రమే ఈ అస్పృశ్యతను పోగొట్టలేదు. అది నిజమే అయినప్పటికీ అది భూమితో సంపదతో ముడిపడి ఉందనేది మనకు స్పృహలో వుండాల్సిందే.

పేజీలు : 384

Write a review

Note: HTML is not translated!
Bad           Good