"నిశా ! నీకు తెలుసా ? నువ్వు నాకు సరిగ్గా అర్ధంకావటం లేదు. నీ ప్రవర్తన బట్టి నేను సరిగా అంచనా వేయలేకపోతున్నాను. ప్రతిసారి నా కాలిక్యులేషన్ తప్పుతోంది. దానికి శిక్ష ఏమిటి తెలుసా? చూపుడువేలు చూపించాడు.
ఏమిటి అంది.
నీ పట్ల నా కాలిక్యులేషన్ తప్పి, రిజల్ట్స్ రాంగ్ అని వచ్చిన కొద్దీ నిన్ను సాదించాలానే పట్టుదల నాలో వేయింతలు పెరుగుతుంది. నీ ఇష్టం ! నువ్వు దాపరికం లేకుండా నాకు సులభంగా అర్ధం అయిపోతే మన మధ్య పేచీలు, పోట్లాటలు , ఉద్రేకాలు, అరుచుకోవటాలు ఉండవు. లేదా - నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్ ! .. ఆతను వెళ్ళిపోయాడు....
నిశాంత , పృథ్వి  , జ్యోతి - ఈ ముగ్గురూ మంచి ఫ్రెండ్స్ , పృథ్వి నిశాంత ను ఇష్టపడతాడు. మనసార కోరుకుంటాడు. అయితే అతడికి సెంటిమెంట్ కన్నా స్వేచ్చే ప్రధానం. ఐ లవ్ యు చెబితే అవతలివారికి మన స్వేచ్చ స్వాతంత్యాల్ని బాగా దగ్గరవుతాడు. ఆమె బాధల్లో పాలు పంచుకుంటాడు. పృథ్వి కిది గిట్టాదు.
అతడి లో అసూయ పెచ్చు రిల్లుతుంది. అయితే నిశాంతి స్వాభిమానం గల అమ్మాయి . ప్రేమకు విలువ యిచ్చినా అభిమానాన్ని కోల్పోదు. ఈ మువ్వురి నడుమ సాగే అందమిమైన  కథే నిశాంత. పృద్వీ నిశాంతి ని  పొందగాలిగాడా ? సున్నితమైన ప్రేమ సూత్రాని తనదైన ప్రత్యక శైలి లో చిత్రించే యద్దనపూడి సులోచనారాణి నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good