"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది.

పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది. మనసులో ఆమెకి నమస్కరించ కుండా ఉండలేక పోయాను.

ఈమధ్య కాలంలో మళ్ళీ మళ్ళీ చదివిన ఆ పుస్తకం పేరు 'నిర్జన వారధి.' లోతైన, బరువైన కథనం.. పుస్తకం పేరులాగే.

'నిర్జన వారధి' చదవక మునుపు నాకు తెలిసిన కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త.
పార్టీలో కొంతకాలం పనిచేసి, తర్వాత నక్సల్బరీ ఉద్యమంలోకి వెళ్ళిన కొండపల్లి సీతారామయ్య భార్య.
ఈ రెండు పాత్రలూ ఆమె జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి ఉంటాయో, ఎన్ని పరిక్షలు పెట్టి ఉంటాయో, ఎన్నెన్ని మలుపులు తిప్పి ఉంటాయో అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు.
అందుకే కావొచ్చు, ఈ పుస్తకం ద్వారా నాకో సరికొత్త కోటేశ్వరమ్మ పరిచయం అయ్యారు.

ఇద్దరు పిల్లలు పుట్టాక, కట్టుకున్న భర్త కారణం చెప్పకుండా వదిలేసినా, ఏ పార్టీ కోసమైతే తను ప్రాణాలకి తెగించి బలవంతపు గర్భ స్రావానికి సిద్ధ పడిందో ఆ పార్టీయే తనని వదులుకునే పరిస్థితులు వచ్చినా, తోడు నిలబడాల్సిన పిల్లలు, అండగా నిలిచిన కన్నతల్లి ఒకరి తర్వాత ఒకరుగా తన కట్టెదుటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా...ఇవన్నీ తట్టుకుని నిలబడ్డమే కాదు, తనకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకుని నిలదొక్కుకున్న మహిళ ఆమె            ----------" నెమలి కన్ను " మురళి

Write a review

Note: HTML is not translated!
Bad           Good