ఆడ మగ అన్న తేడా లేకుండా సర్వం మరచి అమాయకంగా పసిపిల్లలా పగలబడి నవ్వుతూ మాట్లాడుతున్న అలకని చూస్తుంటే మూచ్చటేసింది అరుణ్‌కి. అసలు అతను కోరుకున్నదే అలాంటి అమ్మాయిని కానీ... ఈమెలో ఏదో నటన దాగుంది!... ఇది ఆమె నిజ స్వరూపం కాదు' అనిపిస్తేనే అతని మనసు విలవిల్లాడిపోతోంది.
మరోగంట తర్వాత స్వీట్స్ అవీ తిని మరోసారి అభినందనలు చెప్పి వెళ్ళిపోయారా యువకులు.
"మంచివాళ్ళు!... నేనంటే ప్రాణం!... వెళ్తున్నవాళ్ళకేసే చూస్తూ అంది అలక.
"అఁహఁ!...అన్నటు నీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా వున్నారన్న మాటా! కాని నీకు మగాళ్ళకేసి చూడ్డం అంటేనే తగని సిగ్గని మీ వాళ్ళెవరో చెప్పినట్టు గుర్తు!" అన్నాడు అరుణ్.
గతుక్కుమన్నట్టు చూసింది అలక ఓ క్షణం.
తర్వాత ఆమె మొహం గంభీరంగా అయిపోతుంది.
"కొంతమంది మగాళ్ళకేసి చూడాలంటేనే అసహ్యం! సిగ్గు కాదు!" అంది సీరియస్‌గా.
"అంటే నాకేసి చూడ్డం కూడా అసహ్యం అనుకోవచ్చా!" విసురుగా అన్నాడు అరుణ్.
క్షణం కంగారు పడిందామె.
"కాదు. మీరంటే అసహ్యం అయితే మీ చేత ఆ మూడు ముళ్ళూ ఎందుకు వేయించుకుంటాను!" అంది మెల్లగా. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good