జన్మలన్నిటికన్న మానవ జన్మ శ్రేష్టమైనదని ప్రతీతి. ఎందువలననగా ధర్మర్డ, కామ, మోక్షములను, చతుర్విధ పురుషర్దాములను సాధించుట మానవులకే సుసధ్యము. మోక్షడులను సాధించుటకు ఆరోగ్య రక్షణ అతిముక్యము. ఆరోగ్య రక్షణ మార్గములను మహా ఋషులు ఇట్లు సుత్రికరించిరి.
అనగా ఎల్లప్పుడూ హితమైన ఆహార, విహరములను చేయు స్వభావమును అలవారచుకోనుత, మంచి చెడులు అలోచించి, మంచి పనులు చేయుచు, చెడును విడిచి పెట్టుట, ఇంద్రియ నిగ్రహము కలిగి, ఇంద్రియ విషయములందు అతి ఆసక్తి లేకుండుట, శక్తికి తగిన దానము చేయుట, సత్యము పలుకుట ఆప్తుల మాటలను గౌరవించుట, ఈ లక్షణములను అలవరుచుకున్న మానవులకు ఏ విధమైన వ్యాధులు కలుగక ఆరోగ్యముగా జీవించును.
హితము అనేది సమాజముగా తత్కలికమందు ఆచరించుటకు కష్టముగా అనిపించును. దాని ఫలితము జీవితాంతము సుఖన్నిచుచున్నది. అహితం అనేది తత్కలమందు ఆచరించుటకు సుఖముగా నుండి, దాని ఫలితం జీవితాంతం కష్టముగా ఉండునది.
ఈ పుస్తకము నందు హితమైన ఆహార, విహరములను శాస్త్ర బద్దముగా, ప్రతి వారు ఆచరించి ఆరోగ్యము కాపాడుకోను విధానము వ్రాయబడినది. ఇప్పటి టి.వి.ల యుగంలో అశ్రద్ధ చేయుచున్న నిద్ర ప్రాముఖ్యమును గుర్తు చేయుచు నిద్రధ్యయమున తెల్పబడినది. ఆహితమైన నడవడితో ఆయువును దుఖవంతముగా చేసుకొనుట దుఖయువు లేక ఆహితయువందురు.
కనుక ప్రతివారు సత్ప్రవర్తనతో సుఖయువు పొందుటకు ఈ పుస్తకము నందలి విషయములు తప్పక ఉపకరిచును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good