''మేము జంతువులను వేటాడటానికి అడవుల్లోకి పోతాం, వారేమో మాలాంటి మనుషులను వేటాడడానికి పోతారు.''

''నాపై అత్యాచారం చేసిన తరువాత వారు నన్ను బెదిరించారు, నోరు మూసుకొమ్మన్నారు. వారు చేసింది ఎవరితోనైనా చెబితే, మళ్ళీ వచ్చినపుడు కాల్చి పారేస్తామన్నారు.''

''పోలీసులు, భద్రతా బలగాలు వంతులవారీగా మమ్ముల బాదుతూ, మా రొమ్ములను పిండినారు, చనుమొనలు గిల్లినారు, మా పొట్టలను, వీపును, తొడలను తడిమినారు. ఇలా చేస్తూ వెకిలిగా, పరిహసిస్తూ నవ్వినారు''.

పెద్దగెల్లూరు, నేంద్రా, కున్నా, కోర్చోలి : ఇవి గణతంత్ర ప్రాంతానికి కాపలా స్తావరాలు, ఇక్కడ నివసించే ఆదివాసీలు అడవులపై ఆధారపడి, జీవనాధార సేద్యం చేస్తారు. రాజ్యం, గనుల కార్పోరేట్లు, భద్రతా సిబ్బంది, నిఘా బృందాల చేతుల్లో వీళ్ళు మాటల్లో చెప్పలేని విధంగా విధ్వంసం చేయబడ్డారు.

''నిలువెత్తు సాక్ష్యం : దక్షిణ చత్తీస్‌గఢ్‌లో జరిగిన లైంగిక హింస'', అన్నది భద్రతా బలగాల చేతిలో సామూహిక అత్యాచారాలకు, లైంగికదాడికి, వివస్త్రం, లైంగికహింసకు గురైన ఆదివాసీ మహిళల ఆనలుగు సంఘటనలకు సంబంధించిన అత్యంత శ్రద్ధగా సేకరించిన సాక్షాధారాల వివరణ.

అధికారిక ఉదాసీనత, భయపెట్టడం, బెదిరింపులను తట్టుకుని బాధితులు ముందుకు వచ్చి జవాబుదారీతనాన్ని, న్యాయాన్ని కోరడానికి ఎన్నో ఆటంకాలను అధిగమించారు.

ఇది వారి చరిత్ర.

పేజీలు : 147

Write a review

Note: HTML is not translated!
Bad           Good