ఇందులో ప్రజాకవి వేమన చెప్పిన నిక్కమైన నీలాలు అనడగినవి, నేటికి మేటికి మేటిగా నిలవదగిన 1626 పద్యాలూ భావ సహితంగా వున్నాయి.
తెలుగు శతక సాహిత్యానికి కవిత ప్రమాణికతను, చారిత్రక పరిపుస్తిని కలిగించిన రచనల్లో వేమన పద్యాలూ ప్రముఖ పాత్ర వహిస్తయనడం అతిసేయోక్తి కాదు. వేమన సంపన్నమైన రెడ్డి, కాపు కులంలో జన్మించి సంసారంలో అనేక ఒడిదుడుకులకులోనై ఆనాడు దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న వివిధ మత, సంఘికాది విషయ పరిస్ధితులకు సంక్షుభిత మనస్కుడై కాలక్రమంలో విరక్త చిత్తుడై, సంసారం త్యజించి యోగియై, తత్వజ్ఞానం పొంది దేశం నలుమూలల సంచరించి తన అనుభవాన్ని, నమ్మకాన్ని, నిర్మొహమాటంగా, సూటిగా - తేట తెలుగు మాటలలో ప్రజలకు బోధించారు. వీరి బోధనలు అతవేలడులై, తేటగీతలై ఆంధ్ర సరస్వతికి అనిముత్యాల హరలై అలరించాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good