నిఖిలేశ్వర్‌ కథలు - నిఖిలేశ్వర్‌

గతనాలుగు దశాబ్దాలుగా సాహిత్య-ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యంవున్న కవి, రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్‌. వీరవల్లి గ్రామం (భోనగిరి - నలగొండజిల్లా)లో 1938లో పుట్టి, హైద్రాబాద్‌ మహానగరంలో పెరిగి, 30 సం||ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇప్పుడు పూర్తికాల రచనానిమగ్నతలో ..... దిగంబరకవులు, విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య సంస్థాపక సభ్యుడిగా - ఆనాటి ఆం.ప్ర.పౌరహక్కుల సంఘం - ఇప్పుడు గ్రామీణపేదల సంఘం క్రియాశీల కార్యకర్తగా....

ఇంతవరకు ప్రచురించిన రచనలు .... కవిత్వం : దిగంబరకవులు (మూడు సంపుటాలు), మండుతున్న తరం, ఈనాటికీ, నాలుగుశతాబ్దాల సాక్షిగా నా మహానగరం, ఎవరీ ప్రజాశత్రువులు ? వచనం : గోడలవెనక (జైలు జ్ఞాపకాలు), ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు, ఎవరిదీ ప్రజాస్వామ్యం - ఏ విలువలకీ ప్రస్థానం ?, విరసం పై సంస్థాగత సిద్ధాంత మిమర్శ, నిఖిలేశ్వర్‌ కథలు. అనువాదాలు : హైదరాబాద్‌ అజ్ఞాత చరిత్ర పుటలు, మృత్యు, మరో భారతదేశం, ఆకాశం సాంతం, శబ్దగగనం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good