ఇంకా సూర్యుడు సముద్ర గర్భం నుంచి బయటికి రాని సమయంలో సముద్రానికి ఆనుకుని ఉన్న ఆ బంగాళా వెనుక వైపు దట్టమైన చెట్ల సందుల్లో నుండి జొరబడిన గాలి హుషారుగా ఈలలు వేస్తోంది.... ప్రియురాలి పొందు నుండి పొందిన ఆనందంలాంటి పున్నాగపూల సువాసనలు గాలిలో కలిసి ఆ ప్రాంతాన్ని తన్మయానికి గురి చేస్తూ వున్నాయి. పచ్చిక మీద రాలిన పండుటాకులు, ఎండుటాకులు, ఆరమగ్గిన ఆకులతో ఒక చెఇయ్య తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉంది నేలంతా. అక్కడ అతను వెనుక వైపున్న మెట్ల మీద కూర్చున్నాడు. అతని చూపుడు వేలు, మధ్య వేలు మధ్య నున్న సిగరెట్టు పొగ తెల్లగా ఆ ప్రాంతమంతా వలయాలుగా తిరుగుతోంది. చెట్ల మీద పక్షులు సందడిగా అరుస్తూ సముద్రం వైపు బారులు బారులుగా ఎగురుతున్నాయి. దూరంగా సముద్ర ఘోష! మత్స్యకారుల అరుపులూ, కేకలూ! ఆ బంగాళా మాత్రం ఏదో పోగొట్టుకున్నట్లుగా స్తబ్ధంగా ఉంది. అతని చూపులు అక్కడ పచ్చగా ఏపుగా పెరిగిన పున్నాగ చెట్ల నుండి గిరికీలు కొడుతు రాలుతూ ఒక ఎత్తయిన చెప్టా మీద దట్గంగా పేరుకుంటున్న ప్రదేశంలో కేంద్రీకృతమై వున్నాయి. ఖాళీ దొరికినప్పుడల్లా అతనక్కడకొచ్చి కూర్చుంటాడు. వెళ్తూ వెళ్లూ అతనా పూలని జరిపి ఆ చెప్టాని ఆప్యాయంగా తడిమి వెళ్తుంటాడు. ఈ చెప్టా కథ ఏమిటి? అతని అంతరంగంలో కదలాడే కథ ఏమిటి? అనేక నవలలు, కథలు రాసి రెండుసార్లు నంది అవార్డులు పొందిన ప్రముక రచయిత్రి మన్నెం శారద కలం నుండి వెలువడి, కౌముది అంతర్జాల పత్రికలో మూడు సంవత్సరాలు ధారావాహికంగా ప్రచురించబడి పాఠకుల ప్రశంశలు పొందిన నలభై నాలుగవ నవల ''నిదురించే తోటలోకి...''

పేజీలు : 295

Write a review

Note: HTML is not translated!
Bad           Good