రెడ్డి రాఘవయ్య - నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌
బాలసాహిత్య రచనకే జీవితాన్ని అంకితం చేసిన రచయితల్లో రెడ్డి రాఘవయ్య ఒకరు. వీరు 1940లో గుంటూరు జిల్లా, తెనాలి తాలుకా, ప్యాపర్రు గ్రామంలో జన్మించారు.
నిడుబ్రోలు బోర్డు హైస్కూలులో ఎస్‌.ఎస్‌.యల్‌.సి. వరకు చదివారు. ప్రభుత్వ 'పారిశ్రామిక శిక్షణ సంస్థ'లో శిక్షణానంతరం - బెంగుళూరులోని హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్సులో 'మెకానిక్‌'గా చేరి.... అదే సంస్థ హైదరాబాదు శాఖలో 'ఇంజనీరు'గా రిటైరై ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు.
తొలికథ 'సలహా' (పిల్లల కథ) విశాలాంధ్ర దినపత్రికలోని 'చిన్నారిలోకం'లో 1955 డిసెంబరులో ప్రచురించబడింది. నాటినుండి బాలల గేయాలు, గేయకథలు, పాటకథలు, సైన్స్‌కథలు... బాలసాహిత్యంపై వ్యాసాలు ఎన్నో వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియల్లో వ్రాసిన 32 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ''మణిదీపాలు'' అనే పుస్తకం గా ఆంగ్లంలోకి అనువదింపబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good