భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో సుభాష్ చంద్ర బోస్ స్థానము మరువ లేనిది. విద్యార్ధి దశ మరియు కళాశాల చదువులలో కూడూ తెల్లజాతి వారు నల్లజాతి వారిపై జరుపుతున్న దమనకాండ కు విపరీతమైన ఆవేదన చెందినాడు. చిత్తరంజన్ దాస్ ప్రియ శిష్యుడుగా స్వరాజ్ పార్టీ లో పని చేసి , కాంగ్రెస్ సిద్దాంతాలు వైపు ఆకర్షితుడు అయినాడు. బోసు సిద్దాంతం అతివాదం కాంగ్రెస్ లో గాంధీ గారిది మితవాదం. బోస్ బాబుకి  మితవాదంతో తెల్లవారితే పోరాడితే స్వాతంత్యము ఇప్పట్లో రాదని భావించేవారు. సిద్దాంతాలు తేడా ఉన్నా , గాంధీగారు అన్నా, వారి భావనలు అన్నా బోసుగారికి విపరీతమైన ఆరాధనా, భక్తీ భావాలు ఉన్నాయి. అన్నాడు ప్రజలు కాంగ్రెస్ విధానాలకు మొగ్గు చూపుతూనే, బోస్ గారి ప్రసంగా లకు, విధానాలకు విపరీతంగా ఆకర్షితులు అయినారు. కొద్ది కాలంగా సుభాష్ చంద్రబోస్ ఖ్యాతి బెంగాల్ లోనే కాక యవద్బాతరములోనే వ్యాపించటముతో కాంగ్రెస్ లో గిట్టని మితవాదులు గాంధీ గార్కి బోస్ గారి యెడల విముఖత కలిగేటట్లు చేసినారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటిపడితే , గాంధీ గారు ఆయనకు ప్రత్యర్ధిగా బోగరాజు పట్టాబి సీతా రామయ్య గారిని పోటీకి పెట్టగా, అత్యధిక మెజారిటితో బోస్ గారు విజయం సాధించారు.ఈ పరిమాణానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నివ్వెరపోయారు. ఇది సీతారామయ్య గారి ఓటమి కాదు ణా ఓటమి అని గాంధీ గారు భావించారు.  అదే బోస్ గార్ని కాంగ్రెస్ వాదులు కలుపుకుపోతే భారత దేశానికి ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చేదని పరిశీలకుల భావాన. ఏది ఏమైనా స్వతంత్ర సంగ్రామ చరిత్రలో బోస్ ది విడదీయరాని బంధం. అట్టి ముద్దుబిడ్డ మన దేశంలో జన్మించడం భారతీయుల అదృష్టము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good