ప్రతిదీ తెలిసినట్లుగా వ్రాయడం, స్పందన తెచ్చి పెట్టుకొని వ్రాయడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్రాయగలగడం, వ్యక్తిఆ్వనికీ, రాతలకీ పొంతల లేకపోవడం ప్రొఫెషనల్‌ రచయిత లక్షణాలైతే, సుజాత ప్రొఫెషనల్‌ రచయిత్రి కానే కాదు. తనకు తోచినప్పుడూ, మనసు స్పందించినప్పుడూ, భావోద్వేగాల సంచయం ఎగదోసినప్పుడూ మాత్రమే అప్పుడప్పుడూ వ్రాసే రచయిత్రి సుజాత....
ఎప్పుడూ ఓ అనాధబిడ్డ కోసమో, ఓ నిర్లక్ష్యం చేయబడే ముదుసలి కోసమో, ఎయిడ్స్‌ బారిన పడిన ఓ చిన్నారి కోసమో, తోసివేయబడ్డ ఓ స్త్రీ మూర్తి కోసమో ఏదో చేయాలనీ, చేయించాలనీ తపన పడుతూనే ఉంటుంది...
కొందరామెని 'కమ్యూనిస్టు' అంటారు. మరికొందరామెని ఫెమినిస్టు అంటారు. ఈ ఇజాలని పక్కన పెడితే నా దృష్టిలో ఆమె ఓ మానవతావాది, ఓ వాస్తవికవాది, ఇంకా చెప్పాలంటే ఓ హృదయానుగతవాది. తనకు అన్పించింది మాట్లాడటం, తనకు తోచిందే చేయడం ఆమె నైజం. ఏ నిబంధనలకూ లొంగని, ఏ సామాజిక చట్రాలకూ ఇమడని, ఏ పరిణామాలకూ నెరవని నిర్భీతి ఆమె సొత్తు....- ప్రసాద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good