ఈ ప్రముఖ రష్యన్‌ నవలను శ్రీశ్రీ తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీశ్రీ తెలుగు అనువాదంతో 'నేరమూ శిక్షా' నవల శ్రీశ్రీ అనువాద సాహిత్యంలో చోటు చేసుకుంది. శ్రీశ్రీ స్వీయసాహిత్యంతో పాటు, అనువాద సాహిత్యం కూడా ఎక్కువగానే వెలువడింది. ప్రతి అనువాదంలోను శ్రీఎ సత్తా మనకు అగుపిస్తూనే ఉంటుంది. 

అయితే శ్రీశ్రీ ఈ నవలలోని నాలుగు  అధ్యాయాలు మాత్రమే అనువాదం చేశాడు. నాలుగో అధ్యాయంలో చివరి పేరా విడిచి పెట్టాడు. అయినా శ్రీఎ పాఠకుల కోసం, శ్రీఎ సాహిత్యప్రియుల కోసం, శ్రీశ్రీ సాహిత్య సేకర్తల కోసం - చిన్నదైనా పుస్తకంగా వెలవరిస్తున్నాం. - కన్వీనర్‌, శ్రీశ్రీ సాహిత్యనిధి

మానవుని అంతరంగానికి, చిత్తక్షోభకి, మానసిక అశాంతికి ఈ నవల అద్దం పట్టింది. ఎన్నో ఇనుప తెరల మాటున దాగి మినుకు మినుకు మంటున్న మానవుని ఆత్మవేదనని చాలా లోతుగా చిత్రించాడు. అశాంతి అభద్రతల నడుమ చిత్త చాంచల్యంతో లక్ష్యం లేకుండా అరాచకంగా జీవించే వ్యక్తులకు ఈ నవలలోని ప్రధాన పాత్ర రాస్కాల్నికోవ్‌ పర్యాయపదమైంది. మానవ ప్రవృత్తిని అర్థం చేసుకోను డాస్టోవిస్కీ రచనలు అద్భుతంగా పనికొస్తాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం యీ నేరమూ శిక్షా.

పేజీలు : 53

Write a review

Note: HTML is not translated!
Bad           Good