'నేను సైతం...' గొప్ప 'చారిత్రాత్మక' నవల. సాధారణంగా రాజవంశాల నేపథ్యంతో కూడుకొన్న చారిత్రక నవల కాదు. తెలంగాణ ఆత్మను గర్భీకరించుకొన్ని విజ్ఞాన సర్వస్వం. ''కృష్ణా గోదావరి మధ్య విస్తరించియున్న విశాల భూభాగమే తెలంగాణ. ఒక జాతి అస్తిత్వాన్ని నిలబెడ్తూ జీవన విధానం తెల్పేదే సంస్కృతి. అంతేగాక మనిషి ఉన్నత జీవితం గడపడానికి నిరంతరం చేసే ప్రయత్నమే సంస్కృతి. తెలంగాణ సంస్కృతి విశిష్టమైంది. ప్రత్యేకమైంది. భౌగోళికమైన వనరులతో వున్న ప్రదేశం కావున ఇక్కడి చరిత్ర, నాగరికత, సంస్కృతి మూడు పూవులై వికసించింది. ఆదిమానవుడి నుండి నాగరికతలోని అన్ని దశలను చవిచూసిందీ తెలంగాణ నేల. తెలంగాణ ప్రజలు కష్టజీవులే కాక, అంకితభావం గల క్రియాశీలురు. తమకు అన్యాయం జరిగినపుడు ఆత్మత్యాగానికైనా వెనుకాడని ఆత్మగౌరవం గలవారు. మోసాలు, కుట్రలు, తెలియని నిష్కపటులు. విభిన్న దేశభాషా మత సంస్కృతులు మన ప్రాంతాన్ని రాజ్యమేలినా వారితో కలిసి మెలిసివుంటూ భిన్నత్వంలో ఏకత్వం చూపిన ఘనత మన తెలంగాణాది. అంటూ తెలంగాణ విశిష్టతను సుస్పష్టంగా చాటిచెప్పిన రచయిత్రి ఈమె. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి, మలి ఉద్యమాలు, స్థితిగతులు ఇందులో సమగ్రంగా చిత్రితమైనాయి.  గోపాల్‌, గంగాధర్‌ వంటి పరిమిత పాత్రలు మధ్య మధ్య ప్రవేశిస్తూ పాఠకులను పలకరిస్తాయి. ఉద్యమశీలంతో అసువులు బాసిన యువకిషోరుల తల్లుల-గర్భశోకంతో పొట్టవెళ్లబోసుకొంటున్న ఎల్లవ్వలు-నిరుపేదలైన విద్యార్థులను అక్కున జేర్చుకున్న చదువుసంధ్యలు నెరపిన ఈ ప్రాంత ఉపాధ్యాఉలకు ప్రతినిధులైన లెక్కలసార్లు మొదలైన వారు తెలంగాణ ప్రజల ఆత్మీయతకు అచ్చమైన ప్రతిబింబాలుగా నిలుస్తారు.

పేజీలు : 216

Write a review

Note: HTML is not translated!
Bad           Good