సుషమాదేశ్‌ పాండే మరాఠీ రంగస్థల కళాకారిణి. చిత్ర దర్శకురాలు. జోతి బా పూలే భార్య సావిత్రీ బాయిపూలే జీవిత కథను రంగస్థలం మీద ఏకపాత్రాభినయం చేస్తుంది. దాదాపు గంటపైన పట్టే ఈ ప్రదర్శనలో ఆమె సావిత్రీ బాయిఫూలే జీవితంలోని ప్రధాన ఘట్టాలన్నీ సహజమైన సంభాషణా రీతిలో, అతి సహజంగా వుండే ఆహార్యంతో, వాస్తవికత వుట్టిపడే అభినయంతో చెబుతుంది. ఆ ప్రదర్శన చూడటం ఒక అనుభవం. సావిత్రీబాయి జీవితం తెలుసుకోటానికీ, ఈ ప్రదర్శన ప్రజల కోసం చేయటానికీ, యిలాంటి ప్రయోగాలు మరికొన్ని చేయటానికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలుగులోకి అనువాదం చేశాను. - ఓల్గా

Write a review

Note: HTML is not translated!
Bad           Good