ఇది నోబెల్‌ బహుమతి పొందిన అమ్మాయి కథ
తాలిబాన్ల ఆజ్ఞలను ధిక్కరించి
అమ్మాయిలూ చదువుకోవాలనే ఆకాంక్షతో
తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న ఓ సాహస పుత్రిక కథ 'నేను మలాలా'
అది అక్టోబర్‌ 9, 2012 పదిహేను సంవత్సరాల మలాలా యూసుఫ్‌జాయీ అనే బాలిక పైన పాకిస్తానీ తాలిబాన్‌ తీవ్రవాదులు తుపాకులతో దాడి చేశారు. మధ్యాహ్నాం పాఠశాల నుంచి వస్తున్న సమయంలో ఆమె ఉన్న స్కూలు బస్సు ఆపి ఆమెపై తూటాల వర్షం కురిపించారు. పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనుకోవడమే ఆమె చేసిన నేరం. అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి దేశాభివృద్ధికి తోడ్పడటం తాలిబాన్లకు నచ్చదు. చదువుకోవడం షరియత్‌ (ఇస్లామిక్‌ ధార్మిక చట్టం) కు విరుద్దమని భావిస్తారు.
మలాలా అదృష్టవశాత్తు మృత్యువు నుంచి తప్పించుకుంది. ఆమెపై దాడిని యావత్‌ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. మలాలా నేడు అమ్మాయిల చదువుకు ప్రతీకగా మారింది. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు భారతీయుడు కైలాశ్‌ సత్యార్థితోపాటు అతి పిన్న వయస్కురాలైన మలాలా యూసఫ్‌జాయీకి 2014 నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించారు. పాకిస్తాన్‌కి చెందిన ఈ సాహస పుత్రిక కథే ఈ పుస్తకం.
'నాపై కాల్పులు జరిపిన ఆ తాలిబాన్లపై నాకు ద్వేషం లేదు. ఒక వేళ తాలిబాన్‌ నా ముందుకు వస్తే నావద్ద తుపాకీ ఉన్నా సరే నేను అతడిపై కాల్పులు జరపను. మీరు కూడా మీ పిల్లలను చదివించండి అని చెబుతాను...మహ్మద్‌ ప్రవక్త నుంచి, జీసస్‌ క్రైస్ట్‌ నుంచి, బుద్ధ భగవానుడి నుంచి ఈ దయాగుణాన్ని నేను నేర్చుకున్నాను. - మలాలా యూసుఫ్‌జాయీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good