కంచ ఐలయ్య 'వై ఐ యామ్ నాట్ ఎ హిందూ' (Why I Am Not A Hindu?, Published by Samya, Kolkata) యావత్ భారత దేశంలో గొప్ప సంచలనం సృష్టించిన అద్భుత గ్రంథం. ఆంగ్లంలో తొలి ముద్రణ పొందిన 1996లోనేనాన్ ఫిక్షన్ విభాగంలో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. చాలా దేశాలలోని విశ్వవిద్యాలయాలలో పాఠ్య గ్రంథంగా ఎంపికయింది.

2000 సంవత్సరం ది పయనీర్ పత్రిక ఈ పుస్తకాన్ని ఈ సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటని ప్రకటించింది. (మిగతా నాలుగు పుస్తకాలు: బి.ఆర్.అంబేడ్కర్ ''కుల నిర్మూలన''; నామ్ దేవ్ దసాల్ ''గోల్ పిథా''; గుర్రం జాషువా ''గబ్బిలం''; ముల్క్రాజ్ ఆనంద్ ''అన్టచబుల్'').

2000 సంవత్సరంలోనే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ''నేను హిందువునెట్లయిత?'' పేరిట తెలుగులో వెలువరించింది. ప్రచురించిన కొద్ది మాసాల్లోనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. తెలుగునాట కూడా ఈ పుస్తకంపై విస్తృతమైన చర్చ జరిగింది. జరుగుతోంది. గత పదేళ్లలో ఈ పుస్తకం ఆరు ముద్రణలు పొందింది.
ఇప్పుడు
'నేను హిందువునెట్లయిత?' ఏడో ముద్రణ - మరో కొత్త అధ్యాయంతో, ఆకర్షణీయమైన సరికొత్త ముఖచిత్రంతో వెలువడింది.
తప్పక చదవండి... చదివించండి... చదివి, చదివించి చర్చించండి...!

Write a review

Note: HTML is not translated!
Bad           Good