కాన్సర్‌ను జయించిన 108 మంది విజయగాథలు ఈ ''నేను కాన్సర్‌ని జయించాను''.

నేను కాన్సర్‌ని జయించాను అన్న ఈ పుస్తకం సానుకూల ఆలోచనలు, వ్యాధిని గురించిన జ్ఞానానికున్న శక్తిని గురించి తెలియజేస్తుంది. ప్రతి కథతో పాటు, ఆ కేసుకు సంబంధించిన వివరాలు, అంతర్‌దృష్టి లభ్యమవుతాయి. కాన్సర్‌, దాని చికిత్సకు సంబంధించిన రహస్యంతో కొట్టుమిట్టాడుతున్న పేషంట్లకు దాన్ని ఛేదించడంలో ఎంతో ప్రయోజనకారి.

సానుకూల వైఖరి, ఆశావాద దృక్పథం కాన్సర్‌తో పోరాటంలో ఎంతో కీలకం. మన ఆరోగ్యం, శ్రేయస్సుపై మనస్సు ప్రభావాన్ని ఎవరూ కాదనలేరు.

సాధికారిత మనస్సును భయ విముక్తం చేస్తుంది. ఇందుకోసం నేను డా. విజయ్‌ ఆనంద్‌ రెడ్డిగారిని అభినందిస్తున్నాను. మళ్లీ మనకొకసారి కాన్సర్‌ను జయించవచ్చునని ఎంతో నమ్మకమైన పద్ధతిలో పునరుద్ఘాటించినందుకు ఈ పుస్తకంలోని 108 మంది హీరోలకు నా గుండెలోతుల్లోంచి కృతజ్ఞతలు.

గత రెండు దశాబ్దాలకు పైగా అపోలో బృందం నిరంతరంగా సాంకేతికతను ఉన్నతీకరిస్తూ ఉంది. ఇవ్వాళ మెడికల్‌, సర్జికల్‌, రేడియేషన్‌, అంకాలజీలో మేము అత్యుత్తమ సేవలందిస్తున్నాం. కాన్సర్‌ను జయించవచ్చునని ప్రజలకు తెలియజేయడం కోసం దేశదేశాల ప్రతినిధులు పాల్గొన్న పెద్ద సదస్సులనేకం నిర్వహించాం. ప్రపంచంలో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి చెన్నైలో ప్రొటాక్‌ థెరపీ కేంద్రాన్ని ఏర్పరుస్తున్నాం. కాన్సర్‌ గురించి, దాన్ని తొలి దశలోనే గుర్తించడం గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికీ, అత్యున్నత ప్రమాణాల చికిత్సలను అందించడానికీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. - డా. ప్రతాప్‌ సి. రెడ్డి, పద్మభూషణ్‌ గ్రహీత, ఛైర్మన్‌, అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు

పేజీలు : 538

Write a review

Note: HTML is not translated!
Bad           Good