నేనొక పరిశోధనాత్మక విలేకరిని. భావప్రకటనా స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం 'అధికారిక రహస్యాలచట్టం' కింద ఇతర విలేకరుల మీద మోపినట్లే నామీదకూడా అనేక కేసులు బనాయించింది. నా ప్రచురిత కథనాల బలంతో, ఆత్మవిశ్వాసంతో నేనాకేసులన్నీ ఎదుర్కొన్నాను.
ఈ అంతర్జాలదాడులకి ప్రత్యేక లక్షణం, లక్ష్యం ఉంటాయి. విలేకరిగా నా సుదీర్గ వృత్తిగత జీవితంలో నేనెన్నడూ ఎరగనంత అధమస్థాయి అసభ్యవిద్వేష ప్రచారాన్ని చవిచూసాను. తెల్లవారుఝాముని అందరూ ఆస్వాదిస్తారు. కాని నేను మాత్రం వికారపు ఉదయాలని చూడాల్సివచ్చింది. ఒకటికాదు రెండు కాదు ఆరునెలలు ఓపికపట్టాను. ఇంక నావల్ల కాలేదు.
బహుశ భారతదేశ జర్నలిస్టు చరిత్రలోనే మొదటిసారిగా నిలిచిపోతుంది నేను పోలీస్టేషన్లో ఇచ్చిన కంప్లెయింట్. అంతర్జాలంలో నీడలా వెంటాడి, మాటలతో అసభ్యచిత్రాల పంపిణీతో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకుగాను భారత శిక్షాస్మృతిని అనుసరించి ఒక మహిళ గౌరవభంగానికి పాల్పడినందుకుగాను సదరు నిందితులను శిక్షించమని కోరాను. ఊహించనంతటి స్పందనవచ్చింది. జాతీయంగా, అంతర్జాతీయంగా నేను పెట్టిన కేసుకి ఊహిచనంతటి స్పందన వచ్చింది. జాతీయంగా, అంతర్జాతీయంగా నేను పెట్టిన కేసుకి విశేష ప్రచారం లభించింది. ట్విట్టర్ సదరు ఖాతాని సస్పెండ్ చేసింది. సదరు అనామక నిందితుడు వాడిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ చిరునామా, ఇ-మెయిల్ వివరాలను ఢిల్లీ పోలీసులకు అందించింది. అయినాగానీ ఈరోజు వరకు సదరు నిందితుడిని పోలీసులు అరెస్టు చెయ్యలేదు కారణం అతగాడికి ప్రభుత్వ పెద్దలదన్ను ఉండటమే. - స్వాతి చతుర్వేది
పేజీలు : 104