''వడ్డీ వందకి నాలుగు రూపాయలా'' నాయన అర్థించేవాడు.

''నీకక్కరలేక పోతే చెప్పు. బయట ఆరు రూపాయలిచ్చేవాళ్ళున్నారు'' అప్పించ్చే వ్యక్తి బెదిరింపు.

''అహు ఏదో అడిగానులే తాతా'' నాయన బతిమిలాడే ధోరణి.

''ఎప్పుడిస్తావు'' అప్పు పత్రం రాసేటపుడు రివాజుగా అడిగే ప్రశ్న.

''కార్తీక మాసం వరకి ఇస్తా'' నాయన హామీ.

చివర్లో ''ఇది మా రజా మందీ హోష్‌ తోని వ్రాయించి ఇచ్చిన అప్పు పత్రం'' అంటూ ఏవో ఉర్దూ పదాల వాక్యం చెప్పేవాడు. ఈ అప్పు పత్రం దస్తూరి అంటూ నా పేరు కుదిరించి రాసేవాడిని. సాక్షి సంతకాలు మామూలే. చేతిలో పది రూపాయల నోట్లను, అపురూపంగా చూసుకుని నాయన నావేపు చూసేవాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు....

....

జీవిత వాస్తవికతలో నుంచి వచ్చిన కథలివి. నిత్యం మనం చూసే పాత్రలన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి. ఆ పాత్రలు వాటి సహజ వాతావరణంలో ఉంటాయి. సహజమైన భాష మాట్లాడతాయి. ప్రతి కథ, ప్రతి పాత్ర మనం చూసినట్లే ఉంటుంది. మనకు తెలిసినట్లే ఉంటుంది. అందుకే మరో విధంగా చెప్పాలంటే ఇవి మన కథలే.

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good