చీకటి నుండి వెలుగుకి జరిగిన ప్రస్థానంలో మానవజాతి, అనేక ఉద్విఘ్న ఘట్టాలను చూసింది. అలాగే ఆ ప్రస్థానానికి సారథులై అనుపమాన వ్యక్తిత్వం, విలక్షణాలతో ఛోదకశక్తులుగా చారిత్రక భూమిక నిర్వహించే విముక్తి యోధులను జాగృత ప్రపంచ వైతాళకులను సృష్టించుకుంది. అలాంటి యోధులైన మహనీయులలో జాతి వివక్ష వ్యతిరేక యోధుడు నెల్సన్‌ మండేలా నిస్సందేహంగా ప్రముఖులు.

ప్రపంచంలోని వివిధ దేశాలలో జరిగిన స్వాతంత్య్ర పోరాటాలకు నాయకత్వం వహించిన నాయకులలో మహాత్మాగాంధీ, నెల్సన్‌ మండేలాలది అగ్రస్థానం. భారతదేశంలో కొన్ని శక్తులు ఉదాహరణకు సంస్థానాధీశులు, వారికి తోడ్పాటుగా నిలిచిన మరికొన్ని శక్తులు స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా వున్నట్టుగా మనకు చరిత్ర చెపుతుంది. అయితే దక్షిణాఫ్రికాలో అన్ని వర్గాల ప్రజలను స్వాతంత్య్ర పోరాటం వైపు నడిపిన ఖ్యాతి తప్పనిసరిగా మండేలాదే. అక్కడ కూడా మండేలా బాటను వ్యతిరేకించిన వారు వుండవచ్చుగానీ అత్యధిక ప్రజానీకం మండేలా వెంట నడిచారు. అంతేకాదు సుదీర్ఘకాలం పాటు 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన నేత బహుశా మరొకరు లేరు. బ్రిటీషు వలస పాలకులకు వ్యతిరేకంగా గాంధీని ఆదర్శంగా తీసుకుని అహింసాయుతంగా, శాంతి పథంలో పోరాటం జరిపిన నేత మండేలా.

పేజీలు : 95

Write a review

Note: HTML is not translated!
Bad           Good