తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

నెలవంక :

చంద్రునికి కళంకలంలా క్రికెట్‌ చంద్రునికి క్రీడారంగంలో కీర్తి జీవిత రంగంలో అపకీర్తి.

అలాటి రౌడీ రవించంద్రునికి మరో యువరాణి జతపడి ఢీ అంటే ఢీ అంది. తనపై హజంతో సాగించిన అమానుషానికి శిక్షపడే సమయంలో తాను మనసు మార్చుకుని మానవతియై 'తప్పులు అందరూ చేస్తారు, కొందరే మనుషుల్ని సంస్కారంతో' తీర్చిదిద్దగలరని రుజువుచేసిన అమ్మాయి సాహస చరిత్ర నెలవంక.

ద్వేషించినా ప్రేమించినా ఫలించక; అక్కబిడ్డ కోసం బావగార్ని పెళ్ళాడి అనుమానాలకు అవమానాలకు గురై అక్కబిడ్డను పోగొట్టుకుని కుదేలై మతి తప్పిన మానవతి కథే నెలవంక!

ఆ శ్రుతి తప్పిన వీణను ఏ దేవతలు సవరించారో, అమావాస్య చీకట్లను పారద్రోలి పున్నమి వెన్నెల సరాగాలను ఎలా పలికించారో 'నెలవంక' చదివి ఓహో ఆహా అనండి.

ఈ నెలవంక మీ నెలవంకే...

అమావాస్య చీకట్లు ఎవరివీ? మీవికావు ! మరిఎవరివి?

పేజీలు : 262

Write a review

Note: HTML is not translated!
Bad           Good