ఈ కథలు ఇరవయ్యవ శతాబ్ది తుది దశకపు సామాజికార్ధిక రాజకీయ సంక్షోభాలకు ఒక సమాధానంగా విప్లవోద్యమ ఉనికిని నిరంతరం నేపధ్యంలో సూచిస్తుండటం రుక్మిణి కథా నిర్మాణ వ్యూహంలో భాగం.
'అభివృద్ధి' భావన, ఆచరణల వెనక వున్న అధికార ఆర్ధిక రాజకీయాలను వ&ఆయఖ్యానించి పాఠకుల అవగాహనను మెరుగెక్కించే రాజకీయ కథలుగా రుక్మిణి కథలకు ఈ దశాబ్ది కథలలో ఒక ప్రత్యేకత వుంది....ఈ కథలు జీవిత విధ్వంసాన్ని ఎంతగా చిత్రించాయో పడిపోతున్న జీవితాన్ని, పతనమవుతున్న విలువలను నిలబెట్టుకొనటానికి, నిర్మించుకొనటానికి ఆగిన మనుషుల సాగే అడుగుల సవ్వడిని కూడా అంతగా వినిపిస్తాయి. అందువల్లనే రుక్మిణి కథలు జీవితం పట్ల నిరుపమానమైన విశ్వాసాన్ని, ఆశను వాగ్ధానం చేయగలుగుతున్నాయి. - కాత్యాయనీ విద్మహే

Write a review

Note: HTML is not translated!
Bad           Good