పంచ భుతాలలో ఒకటి నీరు. ఈ భూమిపై ప్రాణికోటి పుట్టాక ముందే నీరు ఉంది. ప్రాణకోటికీ నీరు జీవనాధారం. అనే విషయం జగమెరిగిన సత్యం. నీటికోసం అనేక దేశాలు మధ్య యుద్దాలు కూడా జరిగాయి. భారతదేశంలోని అనేక జీవనడులను పరమ పవిత్ర తీర్దాలుగా భావిస్తున్నాయి. అందుకే ప్రతి ఏడాదికి ఒక నదిలో స్నానాలు ఆచరిస్తూ ప్రజల పునీతులౌతున్నారు. మహాదులపై ఆనకట్టలు నిర్మించి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. నీటి నుండి విద్యుచ్చక్తిని కూడా తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక జల విద్యుత్ కేంద్రాలను నిర్మిచారు. భూగర్భ జలాలు అంతరించి పోతున్న నేపధ్య్మలో నీటి వనరులను కాపాడుకుని భావితరాల వారికి అందించవలసిన బాధ్యతా ప్రతిఒక్కరి పై ఉంది. జల కాలుష్యాన్ని తగ్గించి, తాగే నీటి వనరులు పెంచవలసి ఉంది. |