"అక్కా !నువ్వు పెళ్లి చేసుకోదలచుకుంటే మాకేమి అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎన్నుకున్న యీ హరికృష్ణ భార్యని చంపిన ఒక హంతకుడు ! నువ్వు చూసి చూసి అతనితో జీవితం ముడి పెట్టుకుంటానంటే మేం భరించలేక పోతున్నాం ! నీ ఆప్తులుగా నిన్ను వారించడం మాధర్మం
ఆతను తన మాటల మాయాజాలంతో నీ కళ్ళకి జీవితాన్ని రంగుల కలగా క న్పించేట్టు చేశాడు! అతణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు పొందేదాని కంటే పోగొట్టుకున్నేదే ఎక్కువ ! పేరు ప్రఖ్యాతులు గల మేనక ఎవరిని పెళ్లి చేసుకుంటుంది  ? ఒక హంతకుడిని ! భార్యని నిర్ధాక్షిణ్యంగా చంపిన ఘౌర కిరాతకుడిని ! అక్కా ! దయవుంచి ఈ మార్గం నుంచి వెనక్కి రా! నిన్ను వెనక్కి తీసుకురాకపోతే మేమే నీ దారికి తొలగటం శ్రేయస్కరం అని భావించాము.."
ఆమె ఓ అందాల నటి చేతి నిండా డబ్బూ, గొప్పపేరు, మందీ మార్భాలమూ అన్ని వున్నాయి. అయితే హరికృష్ణ ని  ఇష్టపడిందని ఆమెను ఆమె కుటుంబ సభ్యులంటే వదలేసి పోయారు. హరి కృష్ణ కావాలో తాము కావాలో తెల్చుకోనన్నారు. అడకత్తెరలో పోక చెక్క లాంటి స్థితి ఆమెది. చివరికి మేనక తీసుకున్ననిర్ణయమేమిటి? ఆమె హరిక్రిష్ణ ను  వదులుకుండా?
ఆమె నీరాజనం పట్టింది దేని కోసం ? ఆంధ్రుల అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అల్లిన అందమైన సన్నజాజి పందిరి...

Write a review

Note: HTML is not translated!
Bad           Good