హునోరె డి బాల్జాక్‌ భాష కాస్త పచ్చిగా ఉంటుందని ప్రతీతి. ఆ భావనను బలపరుస్తుంది ఈ నవల.

అద్భుతమైన ప్యారిస్‌ నగర వర్ణన, ఆ నగర జీవితాల చీకటి కోణాలను, తెలీని పార్శ్వాలను ఈ నవల ఆవిష్కరిస్తుంది.

బాల్జాక్‌ ఈ నవలలో పేదవారి గురించి రాయలేదు. కలవారి లైంగిక జీవితాలను గురించి రాసాడు.

ఈ నవల అలంకార భూయిష్టంగా, శృంగారరస భరితంగా సవివరంగా నడుస్తుంది.

9వ శతాబ్ది నాటి ప్యారిస్‌ నగరంలో నివశించే ఒక సంపన్న నిర్దయుడైన యువకుడు ఒక అందాల యువతి వలలో పడతాడు. పొరపాట్లు చేయడం, వావి వరసలను చూడకుండా సంబంధాలు పెట్టుకోవడం, స్వలింగ సంపర్కం, లైంగిక బానిసత్వం, లైంగిక హింస లాంటి సున్నితమైన వివాదాస్పదమైన అంశాలను అతనికి ఆపాదించి సాహసోపేతమైన రచనను రచయిత అందించారు. నాటి సామాజిక కట్టుబాట్లను వెక్కిరిస్తూ నేటికీ వివాదస్పదం అనిపించుకుంటున్న ఈ నవలను ప్రచురణకర్త సాహిత్య విద్యావేత్తలు చిన్నచూపు చూసారు. ఏదేమైనా నవలాకారులు ఆరాధించి, ఆచరించే శైలిలో ఈ నవల ఉంటుంది.

పేజీలు : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good