ఈ పత్రిక అటు అధికార పక్షానికీ చెందదు, ఇటు ప్రతిపక్షాలకూ చెందదు. ఇది ప్రజల పక్షం. వ్యవస్థ ప్రజాస్వామికమే అంటున్నారుగానీ ప్రజలస్వామ్యం ఎక్కడ ఆకనబడదు, వారి భాగస్వామ్యమూ ఉండదు. అయిదేళ్ళకు ఒకసారి ఓటుహక్కు వినియోగించుకోవటం ఒక్కటే ప్రజలు చేసే ప్రజాస్వామిక విధి అయిపోయింది.
డా|| అంబేద్కర్ నిర్యాణం అనంతరం కూడా ఆయనకు అవమానాలు తప్పటం లేదు. ఆయన కృషిని, పోరాటాలను వక్రీకరించారు. ప్రముఖ జర్నలిస్టు అరుణ్ శౌరి ఆయనపై ఒక విమర్శ గ్రంథమే రాశారు. బి.జె.పి. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తిరగరాయడానికి సమీక్ష పేరుతో ప్రయత్నించింది. పూరీ శంకాచార్య, అంబేద్కర్ దళితుల్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ను బ్రిటీష్తొత్తు అన్నారు. నిన్న మొన్నటి వరకు ఆయనను కమ్యూనిస్టులు లిబరల్ బూర్జువా అని ఎద్దేవా చేశారు. ముంబాయిలో ఆయన రాసిన 'రిడిల్ ఆఫ్ రామా అండ్ కృష్ణా'' అధ్యాయాన్ని నిషేధించాలని పెద్ద ఉద్యమమే నడిపారు.
పేజీలు : 180