ఈ సంకలనంలోని కథలన్నీ 2010-16 మధ్య రాసినవే. అందువల్ల ఇవి ఈనాటి సమాజాన్నే ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశం భూస్వామ్య వ్యవస్థలో వేల సంవత్సరాలు మనుగడ సాగించింది. అది వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ, అది వర్గవ్యవస్థకు కూడా. అది నిచ్చెన మెట్ల సమాజం. అసమానతల, వివక్షల సమాజం. ఈ అసమానతలను, వివక్షలను తగ్గించడానికి, నిర్మూలించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. కాని ఆ ప్రయత్నాలు ఆ అసమవ్యవస్థ పునాదుల్ని పెకలించలేకపోయాయి. తర్వాత మనదేశంలోకి వలసపాలన ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రవేశించింది. ఈ వ్యవస్థ మనదేశంలో వేల ఏళ్ళుగా కొనసాగిన భూస్వామ్య వ్యవస్థను కదిలించిందిగాని, కూలదొయ్యలేకపోయింది. ఈ కదిలించడం వల్ల కొన్ని మార్పులు సంభవించింది మాత్రం నిజం. అదే సమయంలో భూస్వామ్య వ్యవస్థ లక్షణాలైన కులమతాల పెత్తనం, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం నిర్వచించుకున్నా మనదేశంలో అది సరైన అర్థంలో ఇంకా నిర్మాణం కాలేదు. ఈ వాస్తవాలన్నింటినీ సునిల్‌ కుమార్‌గారి కథానికలు ప్రతిబింబిస్తున్నాయి. స్త్రీ వివక్ష, కులవివక్ష, ఆర్థిక అసమానత, దోపిడి, అవినీతి, అజ్ఞానం - అన్నీ ఒకే కాలంలో కలిసి కాపురం చేస్తున్న వికృత వ్యవస్థ విమర్శనాత్మక, కళాత్మక ప్రతిఫలనమే సునీల్‌ కుమార్‌గారి కథానికలు.

దెయ్యం, దెయ్యం-2, నీలవేణి, అందం, ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ - ఈ అయిదు కథలు భూస్వామ్య, పెట్టుబడిదారీ కబంధ హస్తాలలో నలిగిపోతున్న స్త్రీల జీవితాలను చిత్రిస్తుండగా సబ్బునురగ, చీకటి, థూ, టెర్మినేటర్‌, ద్వైతము, మహామాయ - ఈ కథలు అనేక సామాజిక రంగాలలో కులమతాలు నిర్వహిస్తున్న పాత్రను ప్రదర్శించాయి. దేవదాసు 2015, పరిశుద్ధ వివాహము - మూడవ ప్రకటన, క్రైస్తవులు లేని చర్చి - ఈ మూడు కథలు దళితులు హైందవంలో బతకలేక క్రైస్తవం స్వీకరించినా అందులోకి కూడా హైందవం దూరి కులవివక్షను ప్రదర్శిస్తున్న వాస్తవానికి ప్రతిఫలనాలు. 'తోకదెయ్యం చెప్పి డిసిప్లికథ' పోలీస్‌ శాఖలోని అనారోగ్యకర ధోరణి ఆవిష్కరించగా, 'నాన్న హైదరాబాద్‌ కొచ్చాడు' అనే కథ భవిష్యత్‌ కథాచిత్రం.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

పేజీలు : 187

Write a review

Note: HTML is not translated!
Bad           Good