జ్ఞానం' అన్నప్పుడు, అది రెండు రకాలు. ప్రకృతి గురించిదీ, సమాజం గురించిందీ. అవి రెండూ కొన్ని సార్లు కలిసి పోతాయి. రెండూ కలిసే సమస్యల్ని పరిష్కరిస్తాయి.

మనుషులు జ్ఞానం నేర్చుకుంటున్న కొద్దీ జీవన పరిస్తితుల్ని మెరుగుపర్చుకోగలగాలి. సమాజంలో మొదటి నించీ అదే జరుగుతోంది. మంచి మార్పుని కలిగించలేని జ్ఞానం, అసలు జ్ఞానమే అవదు. జ్ఞానానికి అదే గుర్తు. జీవిత పరిస్తితుల్ని మెరుగుపరచ గలదా, లేదా?

నాస్తికత్వం అభివృద్ధికరమైనది - అనడంలో సందేహం లేదు. అది, మూఢ నమ్మకాల్ని తీసివెయ్యాలని ప్రయత్నిస్తుంది కాబట్టి. అయితే, దాని అభివృద్ధి పరిధి ఎంత? దేవుడు లేడనే జ్ఞానం సమాజానికి ఏ రకంగా, ఎంత వరకూ అభివృద్ధి? అసలు, ప్రజల సమస్యలేమిటో నాస్తికత్వం గ్రహిస్తుందా? మనుషు లందరి కష్ట సుఖాలూ, అందరి ప్రయోజనాలూ, ఒకటే అయ్యే విధంగా అది చెయ్యగలదా? అంత చెయ్యకపోతే పోనీ ఎంత చేస్తుంది? దాని హద్దు లేమిటి? దాని లక్ష్యా లేమిటి? ఇవన్నీ నాస్తికత్వం గురించి ప్రధానమైన ప్రశ్నలు.

నాస్తికత్వం గురించే కాదు; దాని లాగానే 'హేతువాదం, నవ్య మానవవాదం' అనే సిద్ధాంతాలు కూడా వున్నాయి. నాస్తికత్వం మీద వచ్చే ప్రశ్నలు, ఆ ఇతర వాదాల మీద కూడా వస్తాయి. సిద్ధాంతంగా వున్న దేని మీదైనా ఆ రకం ప్రశ్నలు తప్పవు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good