రచయితల్లో ఆర్‌.కె.నారాయణ్‌ ఒక్కరూ భారతీయుడు. మిగిలినవారంతా ఇతర దేశాలవాళ్లు. ఈ కథలని అనువదించింది బీనాదేవి గారు. ఒక్క కథ తప్ప మిగతా కథలని ఎంపిక చేసింది కూడా ఆమే.

ఆ ఒక్క కథనీ వర్తమాన బ్రిటీష్‌ రచయిత్రి ఫ్రాన్సెస్‌ గోడన్‌ రచించారు. కథ పేరు జాలరి. ఇది నర్మగర్భంగా చెప్పిన ఫెమినిస్టు కథ. రచయిత్రి అనుమతితోనే ఆ కథను ఇక్కడ ప్రచురిస్తున్నాం.

లేవ్‌ నికలయేవిచ్‌ తల్‌స్తోయ్‌, మక్సిమ్‌ గోర్కీ - ఇద్దరూ రష్యన్లు.

గీ డి మొపాస ఫ్రెంచివాడు.

మార్క్‌ట్వైన్‌ క్లెమెన్స్‌ అమెరికావాడు.

జోసెఫ్‌ కాన్రాడ్‌ స్వతహా పోలిష్‌వాడు. తర్వాత ఆయన 1886లో బ్రిటీషు పౌరుడు అయ్యాడు.

రొవాల్‌ డాల్‌ స్వతహా నార్వీజియన్‌. తర్వాత బ్రిటీషు పౌరసత్వం తీసుకొన్నాడు.

చార్లెస్‌ డికెన్స్‌, డి హెచ్‌ లారెన్స్‌ - ఇద్దరూ బ్రిటీషు రచయితలు.

మొపాసవి రెండు కథలు. మిగతా రచయితలు, ఒక్కొక్కరివి ఒకొక్క కథ.

పదిమంది రచయితలు, పదకొండు కథలు...

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good