నక్సల్బరీ ఒక ఊరు కాదు అనే పుస్తకాన్ని సుమారు రెండు దశాబ్దాల కింద అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య అచ్చేసింది. ఆ రోజుల్లో విప్లవంలోకి వచ్చిన యువతరానికి, విద్యార్థులకు ఆ పుస్తకం గొప్ప ప్రేరణ. వాస్తవానికి నక్సల్బరీ ఎప్పుడూ ఒక ఊరు కాదు. ఒక రాజకీయ పంథా. అందువల్లే దేశవ్యాప్తమైంది.
సుమంతా బెనర్జీ రాసిన నక్సల్బరీ వెలుగులో...1980లో ఇంగ్లీషులోనూ, 1982లో తెలుగులోనూ వచ్చింది. కృష్ణమూర్తి అనువాదం చేసిన ఈ పుస్తకాన్ని హైదరాబాదులోని సామ్యవాద సాహితి అనే సంస్ధ అచ్చేసింది. మూడు దశాబ్దాల తర్వాత ఈ తరం పాఠకుల కోసం, విప్లవాభిమానుల కోసం విరసం పునర్ముద్రిస్తోంది. నక్సల్బరీ పంథా దేశ వ్యాప్త ఐక్య విప్లవోద్యమంగా పురోగమిస్తున్న తరుణంలో ఉద్యమ ప్రారంభదశను తెలుసుకోడానికి ఈ పుస్తకం గొప్పగా పనికి వస్తుంది. అందువల్ల అప్పట్లో ఈ పుస్తక రచనకు ఉన్నట్లే, ఇవాళ పునర్ముద్రణకు కూడా విప్లవోద్యమ వికాస చరిత్రలో ప్రాధాన్యత ఉంది.
ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఉద్యమాలు ఆనాటి లాగా లేవు కదా?
అంత ఉద్వేగంగా లేవు కదా? అనిపిస్తుంది. నిజమే. ఆనాటికంటే చాలా పరిణతితో, దీర్గకాలిక దృషఙ్టతో, తప్పొప్పులపై నిర్మొహమాటమైన స్వీయ విమర్శతో విప్లవ ప్రజాస్వామిక పోరాటాలు ఒక క్రమంలో పురోగమిస్తూ అంతిమ విజయం సాధిస్తాయనే వాస్తవిక అవగాహనతో సాగుతున్నాయని స్పష్టమవుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good