2017 మే నాటికి నక్సల్బరీకి యాభై ఏళ్లు. ఈ కాలం పొడవునా ఆటుపోటుల గతితర్కం మధ్యనే సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి ఇది ఒక సందర్బం. ఈ చరిత్రనంతా మధించి మరింతగా విప్లవోద్యమాన్ని పురోగమింపజేయవలసిన సందర్భం కూడా. భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్మిస్తునన విప్లవోద్యమం ప్రపంచ సోషలిస్టు ఉద్యమంలో అతర్భాగం. అందుకే యాభై వసంతాల నక్సల్బరీని యాభై వసంతాల మహత్తర శ్రామిక వర్గ సాంస్కృ విప్లవం, శత వసంతాల బోల్షివిక్‌ విప్లవ స్ఫూర్తిదాయక కార్యక్రమాల్లో భాగంగా సోషలిజమే ప్రత్యామ్నాయమనే నినాదం వెలుగులో నిర్వహించుకోవలసి ఉన్నది

ఇందులో భాగంగానే ఈ పుస్తకాన్ని పునర్ముద్రిస్తున్నాం. నక్సల్బరీ ఉద్యమం కొనసాగింపుగా భారత విప్లవోద్యమం మీద వచ్చిన విశ్లేషణ రచనల్లో దీన్ని ప్రాధాన్యత ఉంది. నక్సల్బరీ ఒక ఊరు కాదు, అదొక పంథా అనే రాజకీయార్థిక, తాత్విక, సిద్ధాంత అవగాహనకు కట్టుబడిన విప్లవ రచయితల సంఘం తెలుగు పాఠకులకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నది. - విరసం

పేజీలు :  136

Write a review

Note: HTML is not translated!
Bad           Good