జీవితంలో తగిన ఒక్కొక్క దెబ్బ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. తగిలిన దెబ్బలకు శరీరమే కాదు, మనసు కూడా రాటుదేలుతుంది. రాయి కన్నా కఠినంగా మారుతుంది. పగ, ప్రతీకారాలే నా ఉచ్ఛ్వాస విశ్వాసాలు.

పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు, మనకు భగవద్గీత దక్కేది కాదు.
వయస్సు పెరుగుతున్న కొద్ది అనుభవాల స్వరూపం మారుతుంది. ఒకనాటి ఒప్పు నేడు తప్పుగా అనిపిస్తుంది.
ఈ రాతలు మొదలుపెట్టినప్పుడు వున్న ఆవేశకావేశాలు కాలం గడిచిన కొద్దీ మారిపోయాయి. గెలుపుకన్నా ఓటమిని అంగీకరించడంలోనే ఆనందం ఉంది. సుమారు పదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ రాతల్లో వున్న నిజాయితీ అప్పటికీ యిప్పటికీ మారలేదు. కాకపోతే నిజాయితీకి ధైర్యం తోడయ్యింది.
ఇవన్నీ నా జ్ఞాపకాలు.
ఈ పుస్తకంలో మహాకవి శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజుగార్ల రచనలు, వేమన సుమతి శతకాలలోని కొన్ని పద్యాలు వాడుకున్నాను.
దిగిరాను దిగిరాను దివి నుండి భువికి
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!...
నాయిచ్ఛయేగాక నాకేటి వెరపు!... - పద్మభూషణ్‌ దేవులపల్లి కృష్ణశాస్త్రి
''రాబందుల రెక్కల చప్పుడు
పయోదర ప్రచండ ఘోషం.
ఝంఝానిల షడ్జధ్వానం'' విని తట్టుకోగల చావ వుంటే యీ పుస్తకం తెరవండి : చలం'' ఈ కొటేషన్లు ఈ పుస్తక రూపకర్త శ్రీ కాట్రగడ్డ మురారి తమ 'నామాట..' శీర్షికలో ఉపయోగించుకున్నారు.
సీతామాలక్ష్మీ, గోరింటాకు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారమకళ్యాణం, జానకిరాముడు, నారీనారీ నడుమ మురారి చలనచిత్ర నిర్మాత శ్రీ కాట్రగడ్డ మురారి గారి అనుభవాలే నవ్విపోదురుగాక...అనే సంకలనం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good