భూత భవిష్య వర్త మానాలను తెలియపరిచేది జ్యోతిష శాస్త్రం, వేదాల్లోంచి పుట్టిన ఈ జ్యోతిష శాస్తం ఆధారంగా మానవుల జాతకములు నిర్ణయించబడతాయి. అట్టి జాతకుల అదృష్ట, శుభాశుబములను ఆయా జాతకుల రాశి, నక్షత్ర, గ్రహ సంచారాలను బట్టి ఏర్పడుతుంటాయి . ప్రపంచం లోని ఏ భాషలో నైనా జ్యోతిష్యానికి అనుసరించే విధానం ఇదే. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని జాతకుల నక్షత్ర రాసి, గ్రహ, సంచారాలను, సామాన్యులకి కూడా అర్ధమయ్యే రీతిలో విపులీకరించిన మహత్తర గ్రంధం ఇది. రాశికి... నక్షత్రానికి సంబంధం ఏమిటి .
నక్షత్రానికి ... గ్రహానికి సంబంధం ఏమిటి ?
గ్రహ సంచారానికి... జాతకునికి సంబంధం ఏమిటి ?
ఏ నక్షత్రం .. ఏ రాసి లో ఏ గ్రహ వీక్షణలో వుంటే .. ఆ ఫలితం ఎలా వుంటుంది. ?
ఇలాంటి రాశి నక్షత్ర గ్రహాలకి... నవరత్నాలలో అనుబంధం ఏమిటి ? .. ఇలా ఎన్నో విషయాలను అరటి పండు వలచి చేతిలో పెట్టినంత సులబం గా సరళ భాషలో వివిరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good