రత్నములు ధరించుట వలన కష్టములు తొలగి సుఖసంపదలు పొందుటచేతనే వేల సంవత్సరముల నుండి రత్నములు ధరించుట మనకు అలవాటుగా మారినది. ధరించే రత్నముల నాణ్యతను బట్టి ఫలితములుండును. ఈ పుస్తకంలో రత్నముల నాణ్యతలను గుర్తించే విధానము, ఏ రత్నము ఎవరు ధరించాలి అనే విషయములు సవిస్తారముగా రచయిత తెలియజేశారు.

శమంతకమణి అనే పేరు వినియే ఉంటారు. శమంతకమణి ధరించుట వలన సత్యభామాదేవికి శ్రీకృష్ణుడంతటి భర్త లభించినాడని ప్రతీతి. అట్లాగే కృష్ణా జిల్లాలో లభించుట వలన అట్టి రత్నము కోహినూరు రత్నం అనేవారు కోహినూరు రత్నములకు అనేక చరిత్ర కలదు. రాజులు వింత రత్నసంపదలను కోరుకునేవారు. ధరించే రత్నము వారికి అనుకూల రత్నమైన మేలు, ప్రతికూలరత్నమైన కీడులను చవిచూపే ప్రమాదమున్నది. అందుకే అలాంటి స్థితి కలుగకుండా విశేష వివరణతో ఈ గ్రంథమును సవరణ మీద సవరణలు చేయటం జరిగింది. కర్ణుడు కవచ కుండలములు దానము చేసిన తరువాత అర్జునుడు తండ్రి దేవేంద్రుడు శ్రీకృష్ణుల వారు మరియు దేవేంద్రుని అంత:పుర పురోహితులు, శాస్త్రవేత్తల సలహాలతో ప్రతిఫలము నాకు ఏమీవద్దు తీసుకొనను అంటున్న కర్ణుని బలవంతముగా మోమాట పరచి అతనికి అంటే కర్ణునకు వజ్రాయుధమును ఇచ్చినారు. నాటి నుండి కర్ణుడు యుద్ధములో భీష్ముడు సరైన స్థానము చూపకపోవటము, ద్రోణుడు దరిదాపు అదేవిధముగను, అశ్వాద్ధామతో భేదాభిప్రాయములు కలిగినవి దౌవికముగా ఆ వజ్రాయుధము కర్ణుడు ఉపయోగించదలచిన అర్జునుని మీద కాకుండా ఘట్చోగజుడు మీద ప్రయోగించవలసి వచ్చినది. కర్ణుడు పరాజయము, ప్రాణమును కూడా కోల్పోయినాడు.

Pages : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good