పాతిక ముఫ్పై ఏళ్ళుగా 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వ సాహిత్యంలోని ఒక ఇంగ్లీషు నవలని పరిచయం చేస్తూ వున్నాను 'పాత కెరటాలు' శీర్షికలో. ఇప్పటిదాకా సుమారు మూడువందల ఏభై నవలలని పరిచయం చేశాను. ఈ పాతకెరటాలలో అప్పుడప్పుడు కొత్త కెరటాలని కూడా జోడిస్తూ చేసిన ఈ నవలా పరిచయాలు, విశ్వవిద్యాలయ విద్యార్ధులకి చాలా ఉపయోగంగా వుంటున్నదని అనేక మంది ఉత్తరాల ద్వారా తెలియజేశారు. పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని చాలామంది రాయటం చేత, ఈ పాతికేళ్ళలో వచ్చిన వాటిలో కొన్నిటిని ఎంచి, పాత కొత్తల మేలుకలయికతో ఈ సంకలనాన్ని కూర్చాను. లోగడ నవలా పరిచయాలు, ఏర్చికూర్చిన ప్రసిద్ధ కథలు, పాత కెరటాలు అన్న పేరున మూడుసార్లు ముద్రితం అయ్యాయి. ఇదివరకు అచ్చయిన నవలా పరిచయాలని ఈ సంకలనంలో చేర్చకుండా, అన్నీ కొత్తవాటినే చేర్చాను. ఈ ఎంపిక పాఠకులకి నచ్చుతుందన్న ఆశాభావంతో సంకలనాన్ని మీ ముందు ఉంచుతున్నాను.  ఇవి రెండు భాగాలు ఇప్పుడు ముద్రిత మయినవి. పాత కెరటాలు - 1, పాతకెరటాలు - 2. - మాలతీ చందూర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good